జగిత్యాల : బీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని, కాంగ్రెస్, బిజెపిలు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని గొల్లపల్లి మండలం గోవిందుపల్లె గ్రామంలోని యంగ్ స్టార్స్ యూత్ అసోసియేషన్ యూత్ అధ్యక్షుడు కలమడుగు తిరుపతి ఆధ్వర్యంలో 50 మంది యూత్ సభ్యులు, బుగ్గారం మండలం శేకల్ల గ్రామం నుంచి కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి 20 మంది కార్యకర్తలు శనివారం క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి గులబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారని పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షల మేరకు స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టి తెలంగాణను అన్ని రంగాల్లో ప్రగతిపథాన నడిపిస్తున్న కేసీఆర్ మహోన్నత నాయకుడు అని కొనియాడారు. మూడోసారి కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.