జగిత్యాల : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వృద్ధుడికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula ) సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. అతడిని తన కాన్వాయిలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఆదివారం గంగాపూర్ గ్రామానికి చెందిన రేంటం రాజమల్లు అనే వృద్ధుడు(Oldman) వెల్గొండలోని తన కొడుకు ఇంటి వద్దకు ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. వెల్గొండ స్టేజి వద్ద ఆ వాహనాన్ని కారు ఢీ కొనడంతో రాజమల్లుకు తీవ్రగాయాలయ్యాయి(Injure).
అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి కారు దిగి బాధితుడిని పరామర్షించి తన కాన్వాయిలోని వాహనం ఇచ్చి ఆసుపత్రికి పంపించారు. దీంతో పాటు వైద్య సహయం(Treatment) కోసం కొంత నగదును అందజేశారు. మంత్రి అందించిన సహాయానికి స్థానికులు అభినందనలు తెలియజేశారు.