మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 18:26:11

టీఆర్ఎస్ కార్యాలయ పనులను పరిశీలించిన మంత్రి కొప్పుల

టీఆర్ఎస్ కార్యాలయ పనులను పరిశీలించిన మంత్రి కొప్పుల

 జగిత్యాల : జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న  టీఆర్ఎస్ కార్యాలయ పనులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  పరిశీలించారు.  పనులు జరుగుతున్న తీరును కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిపై పలు సూచనలు చేశారు.  మంత్రి వెంట జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత , స్థానిక శాసన సభ్యు డు సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, చొప్పదండి శాసన సభ్యుడు సుంకె రవిశంకర్  ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు.


logo