జీవితంలా అనిపించే సినిమా
‘తమిళ నిర్మాత సతీశ్‌తో అనుకోకుండా ఏర్పడ్డ పరిచయం నన్ను నిర్మాతను చేసింది. ఆయన తమిళంలో నిర్మించిన ‘రంగోలి’ సినిమాను నాకోసం స్పెషల్‌గా స్క్రీనింగ్ వేశారు.
‘తమిళ నిర్మాత సతీశ్‌తో అనుకోకుండా ఏర్పడ్డ పరిచయం నన్ను నిర్మాతను చేసింది. ఆయన తమిళంలో నిర్మించిన ‘రంగోలి’ సినిమాను నాకోసం స్పెషల్‌గా స్క్రీనింగ్ వేశారు. ఆ తర్వాత సినిమా ప్రీరిలీజ్ వేడుకకు పిలిచి, ‘రంగోలీ’ సినిమాకు తెలుగు నిర్మాతగా నన్ను సభాముఖంగా పరిచయం చేశారు. నాక్కూడా సినిమా అద్భుతంగా నచ్చడంతో ఆ సినిమా ‘సత్య’గా మీ ముందుకు తెస్తున్నాను. ఓ విధంగా ఇది అనుకోని మలుపు’ అని నిర్మాత శివ మల్లాల అన్నారు.
హమరేశ్, ప్రార్థన జంటగా, వాలి మోహన్‌దాస్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘రంగోలి’ సినిమాను ‘సత్య’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు శివ మల్లాల. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘తెలుగు సినిమానే చూస్తున్న అనుభూతి కలిగేంత పర్ఫెక్ట్గా డబ్బింగ్ చేశాం. ఏ విషయంలోనూ రాజీ పడలేదు.
దర్శకుడు వాలి మోహన్‌దాస్ మంచి ప్రతిభావంతుడైన దర్శకుడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువ అవుతాడు. సీడెడ్‌లో 28 థియేటర్లు విడుదల చేస్తున్నాం. పీవీఆర్, ఐనాక్స్, సినిమాక్స్ తదితర థియేటర్లలో కూడా భారీగా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’ అని తెలిపారు. టీనేజ్ లవ్, తండ్రీకొడుకుల భావోద్వేగాలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని, ఒక జీవితాన్ని చూస్తున్న అనుభూతిని కలిగించే సినిమా ఇదని శివ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

