విజయవాడ: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ (Vijayawada) కనకదుర్గ అమ్మవారిని (Kankadurga ammavaru) మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం సతీసమేతంగా ఆలయానికి వెళ్లిన ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కనక దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు మంత్రి కొప్పుల దంపతులకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవటం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. అమ్మవారి దీవెనలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు.