హైదరాబాద్ : రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథుడిని శనివారం దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత పవిత్రమైన ఘాట్లలో ఒకటైన దశాశ్వమేధా ఘాట్లో నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలో కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్న మంత్రి.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కాశీ విశ్వనాథుడిని వేడుకున్నట్లు తెలిపారు.