హైదరాబాద్: ముస్లిం సోదరులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) రంజాన్ (Ramadan) శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల పండుగలను (Festivals) ప్రభుత్వ అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు. గత ప్రభుత్వాలు మైనార్టీలను ఓటు బ్యాంకులా మాత్రమే చూశాయన్నారు. తెలంగాణలో మాత్రమే సర్వమత సామర్స్యం పరిఢవిల్లుతున్నదని పేర్కొన్నారు.
మైనార్టీల సంక్షేమ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. కోకాపేటలో (Kokapet) రాష్ట్రం ప్రభుత్వం ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాలుకు 10 ఎకరాలు కేటాయించిందని, భవన సముదాయం నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో 408 మైనారిటీ గురుకుల పాఠశాలలను నెలకొల్పిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని చెప్పారు. వక్ఫ్‌బోర్డులో (Waqf board) నిర్మాణాలు, మరమ్మతులకు రూ.53 కోట్లు గ్రాంట్ మంజూరు చేశామని తెలిపారు.