Minister Koppula Eshwar | కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు : మంత్రి కొప్పుల
Minister Koppula Eshwar | కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలో ‘మన ఊరు - మనబడి’లో భాగంగా రూ.52.67లక్షల నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు.
Minister Koppula Eshwar | కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలో ‘మన ఊరు – మనబడి’లో భాగంగా రూ.52.67లక్షల నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. అలాగే గ్రామంలో రూ.77లక్షలతో గంగదేవిపల్లి నుంచి మొగుల్ల చెరువు వరకు వంతెన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కోరంగంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తుందన్నారు.
వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువులు పునరుద్ధరణ, రైతుబంధు, రైతుబీమా పథకాలను తీసుకువచ్చిందన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలుతో ఆదర్శంగా నిలిచిందన్నారు. అలాగే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికే ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. కార్యక్రమం మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3497.62కోట్లతో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

