పెద్దపల్లి : అధికార దాహంతో ఇస్తున్న ఎన్నికల హామీలపై కాంగ్రెస్ను దళితులు నమ్మే పరిస్థితుల్లో లేరని రాష్ట్ర సంక్షేమ శాఖ కొప్పుల ఈశ్వర్ ( Minister Koppula ) అన్నారు. పెద్దపల్లి జిల్లాలో మంత్రి మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు బీఆర్ఎస్ (BRS) లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ ఇటీవల చేవెళ్లలో జరిగిన ఎస్సీ (SC), ఎస్టీ(ST) డిక్లరేషన్ లో ప్రకటించినది శుద్ధ అబద్ధమని పేర్కొన్నారు. కేసీఆర్(CM KCR) ప్రభుత్వం దళిత వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నందున బీఆర్ఎస్కే మద్దతు పలుకుతున్నారని వెల్లడించారు. ఖిలావనపర్తి గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాలకు చెందిన ప్రతినిధులు ఆ గ్రామ సర్పంచ్ సాగంటి తార కొండయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు.
కొత్తూరులో రజక సంఘ భవనాన్ని, పల్లె దవాఖానను మంత్రి ప్రారంభించారు. గ్రామానికి చెందిని మున్నూరు కాపు సంఘం యువకులు బీఆర్ఎస్ లో చేరారు. ధర్మారం మండలంలోని ఆర్అండ్ బీ రోడ్ల మరమ్మతులకు రూ.8.78 కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి ఈశ్వర్ తెలిపారు .
అంతకు ముందు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన జిల్లా యూత్ నాయకులు మిట్ట భరత్ కొన్ని రోజుల క్రింతం రోడ్డు ప్రమాదంలో గాయపడి కరీంనగర్ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకుని అతన్ని ఆసుపత్రిలో మంత్రి పరామర్శించారు.