రాజన్న సిరిసిల్ల : వేములవాడ(Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ(Minister Konda Surekha), ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి దర్శించు కున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకు ముందు మంత్రికి అర్చకులు ఘన స్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో దేవుడి మాన్యాలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. సర్వే నంబర్ల ద్వారా దేవాలయాలకు హద్దులు గుర్తించి కాపాడుతామని మంత్రి పేర్కొన్నారు.