హైదరాబాద్, జనవరి 12 (నమ స్తే తెలంగాణ): భవిష్యత్తు తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించేందుకు కృషిచేయాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంతగా తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
ప్లాస్టిక్ వ్యర్థాలతో పరిసరాలు, గాలి, నీరు కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని విధిగా తగ్గించాలని పిలుపునిచ్చారు. తన కార్యాలయంతో పాటు నివాసంలోనూ వీలైనంతగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నియంత్రించనున్నట్టు శు క్రవారం విడుదల చేసిన ఓ వీడి యో సందేశంలో పేర్కొన్నారు.