మెదక్ : బడిబాట కార్యక్రమం విద్యార్థుల జీవితాల్లో ఉత్తేజాన్ని నింపుతుందని అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ( Konda Surekha) అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట(Badi bata) కార్యక్రమంలో భాగంగా బుధవారం మెదక్ జిల్లా కొల్చారం(Kolcharam) జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్‌బుక్స్, దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..విద్యతోనే సమాజంలోని అంతరాలు పోతాయన్నారు. ఆర్థిక, సామాజిక అంతరాలను తగ్గించేది విద్య మాత్రమేనని స్పష్టం చేశారు. విద్యార్థులలో ప్రతిభను వెలికి తీసి వారిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా చూడాల్సిన గురుతరమైన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. పాఠశాలలు పుః ప్రారంభమైన మొదటి రోజే పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేశామన్నారు.