కరీమాబాద్, జూలై 6: వరంగల్ ప్రజల కొంగు బంగారమైన భద్రకాళి అమ్మవారికి త్వరలో బోనం సమర్పిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించే అంశం వివాదాస్పదమైన విషయం తెలిసిం దే. పండితులు, నగర ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించడాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు.
అయితే ఆదివారం వరంగల్ నగరంలోని కరీమాబాద్‌లో బీరన్న బో నాల పండుగకు హాజరైన ఆమె భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించడంపై పునరాలోచన చేస్తామని అనడంతో మళ్లీ ఈ అంశంపై తెర మీదకు వచ్చింది.