Konda Surekha | చిత్తడి నేలల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : కొండా సురేఖ
Konda Surekha | ప్రభుత్వ కృషికి ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) అన్నారు.
రంగారెడ్డి : ప్రభుత్వ కృషికి ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా నెక్నంపూర్ సరస్సు వద్ద నిర్వహించిన ‘చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం ’(Wetlands) వేడుకలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటడంతో పాటు, చిత్తడి నేలలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఎగ్జిబిషన్ స్టాళ్లను మంత్రి పరిశీలించారు.
అనంతరం పర్యావరణ పరిరక్షణ, చిత్తడి నేలల సంరక్షణకు అనుసరించాల్సిన విధానాలపై మంత్రి సురేఖ మాట్లాడారు. పూర్వకాలంలో కాలుష్యం ఉండేది కాదన్నారు. జనాభా పెరుగుతున్నది కొద్దీ ప్రజలు అవగాహన లేమితో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుంటంతో కాలుష్యం పెరుగుతున్నదన్నది పేర్కొన్నారు. ప్లాస్టిక్ మానవాళి పట్ల శాపంగా మారిందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో పేపర్ బ్యాగులను వాడాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు.
పాఠశాలల ఉపాధ్యాయులు, యాజమాన్యాలు పర్యావరణ పరిరక్షణ దిశగా విద్యార్థులను ప్రోత్సాహించాలని సూచించారు. చిత్తడి నేలల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్య క్రమంలో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ సెక్రటరీ ఖాళిచరణ్ ఎస్ ఖర్తడే, ఎం. సునీల, శిల్పా శర్మ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

