ఎమ్మెల్యే శ్రీహరి తీరు ఆత్మగౌరవం దెబ్బతీసింది
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహారం తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నదని అట వీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీ సుకెళ్లారు.
- మీనాక్షితో మంత్రి సురేఖ
- 4 పేజీల ఫిర్యాదు లేఖ
హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ): స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహారం తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నదని అట వీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీ సుకెళ్లారు. మంగళవారం హైదరాబాద్‌లో మీనాక్షిని కలిసిన నాలుగు పేజీల ఫిర్యాదు లేఖను అందజేశారు. శ్రీహరి తనకు సమాచారం ఇవ్వకుండా, తన ప రిధిలోని దేవాదాయ శాఖపై సమీ క్షించడం పాలనా వ్యవస్థకు విరుద్ధమని సురేఖ అభ్యంతరం వ్యక్తంచేసి నట్టు తెలిసింది.
మంత్రిగా తన పని తాను చేసుకుంటుంటే, అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని, శ్రీహరి తీరు సరికాదని పేర్కొన్నట్టు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఏఐసీసీ పెద్దలకు ఫిర్యా దు చేశారు. కొండా సురేఖ లేఖను స్వీకరించిన మీనాక్షీ నటరాజన్, మంత్రి చెప్పిన మాటలు విని.. ఈ సందర్భంగా మంత్రికి పలు సూచనలు చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పనిచేయాలని సూచించినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

