Konda Surkha | నాపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌పై సురేఖ డైరెక్ట్ అటాక్ చేశారు. ఢిల్లీలో హైకమాండ్‌ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎం అని తనే చెప్పుకుంటున్నాడు. అది ఎంత వరకు సమంజసమన్నారు. రాష్ట్ర కేబినెట్లో ఇతర శాఖ మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయి. సీఎంపై మంత్రులు, నేతలు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనని రాజీనామా చేయమని, మరొకటిగాని నాకు ఎవరు చెప్పలేదు. హైకమాండ్‌కు రాతపూర్వకంగా అన్ని వివరాలు తెలియజేశానని తెలిపారు.
నా బిడ్డ మాట్లాడితే నాకెందుకు శిక్ష వేస్తారు. రెడ్లలో ఎంతో మంది అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. బీసీకి ఒక న్యాయం ఇతర సామాజిక వర్గాలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. అంతా సద్దుమణిగింది అనుకునే తరుణంలో సురేఖ వ్యాఖ్యల అంతరార్దం ఏటంటనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. ఢిల్లీలో రాజీ మంత్రం బెడిసికొట్టడం వల్లే ఆమె ఇలా మాట్లాడుతుందేమోనని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. మరోవైపు సురేఖపై అధిష్ఠానానికి సీఎం నివేదికను అందజేశారు. సాధ్యమైనంత త్వరగా ఆమె చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ఈరోజే కొండా సరేఖపై హైకమాండ్ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.