Konda Surekha | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల తీరుపై రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న సిఫారసు లేఖల తిరసరణపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించాలన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలను కూడా టీటీడీ అమలు చేయడం లేదని కొండా సురేఖ ఆవేదన వ్యక్తంచేశారు. టీటీడీ తీరుతో తెలంగాణ ప్రజాప్రతినిధులు, భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నదని తెలిపారు. తెలంగాణ భక్తులు తిరుమలలో గౌరవప్రదంగా దర్శనం చేసుకునేందుకు వీలుగా టీటీడీ అధికారులను అదేశించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాసినట్టు మంగళవారం ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు.