Komatireddy Venkat Reddy | హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ సమ్మిట్ వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి మాట తడబడి అభాసుపాలయ్యారు. సమ్మిట్లో భాగంగా తెలంగాణ సినిమా రైజింగ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వేదికపై తనను తాను పరిచయం చేసుకుంటూ.. తెలంగాణ రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ, ఏవియేషన్ మంత్రినని చెప్పుకొన్నారు. ఏవియేషన్ శాఖ కేంద్రప్రభుత్వ పరిధిలో ఉంటుందనే విషయం తెలియకుండా తాను ఆ శాఖను నిర్వహిస్తున్నట్టు చెప్పుకొన్నారు. 30 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, తన అభిమాన హీరోయిన్ జెనీలియా అని చెప్పుకున్నారు. ఆమె సినిమాలు వదలకుండా చూశానని తెలిపారు. మంత్రి మాటలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
వాటర్లో నీళ్లు ఎక్కువ కలవడం వల్ల సివిల్ ఏవియేషన్ మంత్రిగా మారిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
గమనిక:
సివిల్ ఏవియేషన్ శాఖ కేంద్రంలోనే ఉంటుంది https://t.co/hDPAOpY99x pic.twitter.com/c3rl3eEHxd
— Telugu Scribe (@TeluguScribe) December 9, 2025