హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy )పరామర్శించారు. హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద దవాఖానకు వెళ్లిన వెంకట రెడ్డి.. కేసీఆర్(KCR)ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రి ఆరా తీశారు. కేసీఆర్ను పరామర్శించిన వారిలోకాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ హనుమంతరావు, కోదండరామిరెడ్డి ఉన్నారు. కాగా, అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాస్పిటల్కు చేరుకుని కేసీఆర్ను పరామర్శించారు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్ కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. వైద్యులు వాకర్ సాయంతో ఆయనను నడిపించారు. ఏడెనిమిది వారాల్లో కోలుకుంటారని వైద్యులు తెలిపారు.