హైదరాబాద్ : రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ రహదారుల హోదా ఇవ్వాలని కోరుతూ సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Gadkari)ని న్యూఢిల్లీ( Delhi)లోని వారి నివాసంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkata Reddy) కలిశారు. ప్రాంతీయ రింగ్‌రోడ్డు సౌత్‌ను జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. విజయవాడ-హైదరాబాద్ రహదారిని ఆరు లేన్లకు, హైదరాబాద్-కల్వకుర్తి రోడ్డును నాలుగు లేన్లకు విస్తరించడంతోపాటు సెంట్రల్ రోడ్డు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) ద్వారా రాష్ర్టానికి రావాల్సిన నిధులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఐ.గణపతి రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా.గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.