హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ సిబ్బంది కష్టపడి పనిచేయాలని మంత్రి జూ పల్లి కృష్ణారావు సూచించారు. శుక్రవారం అబ్కారీ భవన్లో పలు విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ విభాగాల పనితీరును అధికారులు మంత్రికి వివరించారు.
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ఆదేశించారు. శుక్రవారం కాజీపేట యూనిట్‌ను సందర్శించిన ఆయన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అధికారులకు భద్రతాపరమైన సూచనలు చేశారు.
.