పెంట్లవెల్లి, సెప్టెంబర్ 17: ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దళితులపై చిర్రుబుర్రుమన్నారు. నాగర్కర్నూల్ జిల్లా జటప్రో ల్ గ్రామంలోని సమీకృత గురుకుల పాఠశాల భవనం కోసం దళితుల భూమిని ఎంచుకున్నారు. మంగళవారం సదరు స్థలాన్ని పరిశీలించేందుకు మంత్రి రాగా, సర్వే నంబర్ 508లో ఎనిమిది ఎకరాల భూమిని నాటి జటప్రోల్ సంస్థానాధీశులు రాజాజగన్నాథరావు తమకు ఇచ్చారని దళితులు కిష్టన్న, పెంటయ్య, బాలయ్య, బాలపీరు, సంగమ య్య, శేషమ్మ, శాలయ్య, బాలయ్య తెలిపారు.
దీంతో మంత్రి.. నోరు మూయండని బా ధితులను బెదిరించారు. సెక్యూరిటీ వారిని అడ్డుకున్నారు. న్యాయం కోసం వస్తే పట్టించు కోలేదని దళితులు ఆవేదన వ్యక్తంచేశారు.