నిజామాబాద్ : ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఆరు గ్యారంటీలు అమలు చేయనున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రజా పాలనపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన(Praja Palana) నిర్వహణ ప్రణాళిక పక్కగా రూపొందించాలని, అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని ఆదేశించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు(six guarantees ) అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించారు. ఎంతో మంది తమ సమస్యలు, తమ కష్టాలు తీరుతాయని ఎంతో ఆశతో ఉన్నారని అన్నారు. ప్రజల సమస్యలను తీర్చి వారి ఆర్థిక ప్రగతికి(Finanicial support) తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించిందని తెలిపారు.
అధికారులు మొక్కుబడిగా కాకుండా జవాబుదారీ తనంతో అత్యంత పారదర్శంకంగా పని చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరించి ఆ డాటాను డిజిటలైజ్ చేయాలని తెలిపారు. ఈ సమీక్షలో రాజ్య సభ్యుడు కెఆర్ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు .