Minister Jagdish Reddy | తెలంగాణలో కరెంట్ తీగలు పట్టుకుంటే కాంగ్రెస్ నేతలకు నిజాలు తెలుస్తాయి : మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
Minister Jagdish Reddy | రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అంశం(Electrical factor) పై ఇంకా కాంగ్రెస్ నాయకులు గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy )ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేటలో మీడియా సమావేశంలో ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. కర్ణాటకలో కాంగ్రెస్ 5గంటలే విద్యుత్ ఇస్తుందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు చేస్తున్నారు.
సూర్యాపేట : రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అంశం(Electrical factor) పై ఇంకా కాంగ్రెస్ నాయకులు గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy )ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేటలో మీడియా సమావేశంలో ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. కర్ణాటకలో కాంగ్రెస్ 5గంటలే విద్యుత్ ఇస్తుందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు చేస్తున్నారు.
కుమారస్వామి వ్యాఖ్యలతో మరోసారి కాంగ్రెస్ పార్టీ బండారం బయటపడిందన్నారు. కాంగ్రెస్ పనితనం కావాలంటే కర్ణాటకలో 18 గంటలు విద్యుత్ వైర్లు పట్టుకుని నిలబడతాను. తెలంగాణలో మీరు సిద్ధమా..ధైర్యం ఉంటే తెలంగాణలో కరెంట్ తీగలు పట్టుకుని కాంగ్రెస్ నేతలు ఓట్లడగాలని సవాల్ విసిరారు. కరెంట్ తీగలు పట్టుకుంటే కాంగ్రెస్ నేతలకు నిజాలు తెలుస్తాయన్నారు.
ఓట్ల పేరుతో గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలన్నారు. ముందు కరెంట్ తీగలు పట్టుకున్నాకే ఓట్లడగమని డిమాండ్ చేయాలన్నారు. బీఆర్ఎస్ వచ్చాకే గ్రామాలు పచ్చగా మారాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వస్తే చీకట్లు, కరువు తప్పదు. పోయిన కాంగ్రెస్‌ని మళ్లీ రానీయకుండా ఊరి బయట నుంచే తరిమికొట్టాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

