Minister Jagadish Reddy | తండాలను పంచాయతీలుగా మార్చిన ఘతన సీఎం కేసీఆర్‌దేనని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం బడితండాలో గిరిజనులకు ప్రత్యేకమైన చాంపూలాల్ జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంప్రదాయం మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించి, డప్పులను మోగించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గులాబీ జెండా నీడలో గిరిజనతండాలు శోభాయమానంగా మారాయని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో తండాలు పంచాయతీలుగా ఆవిష్కృతమయ్యాయన్నారు. కోట్లాది నిధులతో గిరిజన ఆవాలను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. 2014కు ముందు.. తర్వాత ఉన్న పరిస్థితిని ఒకసారి పరికించి చూస్తే.. పురోగతి బోధపడుతుందన్నారు.
అంతర్గత రహదారులతోపాటు గిరిజన తండాలు కళకళలాడుతున్నాయని, అందుకు కారణం సీఎం కేసీఆర్ దార్శనికత అన్నారు. మిషన్ భగీరథతో గిరిజన తాండాలలో మంచి నీటి ఎద్దడిని నివారించిన ప్రభుత్వం గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు వీలుగా 20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కోసం గిరిజనులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తోడ్పాటునందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. గులాబీ జెండాయే గిరిజన తాండాలకు నీడ నిస్తుందని, ఆ నీడ చాటున యావత్ గిరిజన సమాజం మరింత పురోగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు గిరిజనుల ఆరాధ్య దైవం చాంపూలాల్ ఆశీస్సులు బలంగా ఉండాలని ప్రార్థించినట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి వివరించారు.