సూర్యాపేట : సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటే బీజేపీ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం
సూర్యాపేటలో నూతన ఆసరా ఫింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
కేసీఆర్ రైతు సంక్షేమ కార్యక్రమాలను దేశ వ్యాప్త రైతు సంఘాలు మెచ్చుకుంటున్నాయి. బీజేపీ కేసీఆర్ పై కుట్రతో రాష్ట్ర సంక్షేమాన్ని చీకట్లోకి నెట్టే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ దుర్మార్గపు సిద్ధాంతాలను వ్యతిరేకించే రాష్ట్రాలను కూల్చే ప్రయత్నం చేస్తున్న బీజేపీ
చట్టబద్ధ సంస్థలను దుర్వియోగం చేసి దేశంలో కల్లోలానికి కారణమవుతున్నదని ఆరోపించారు. బీజేపీ కుట్రలను నిలదీసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు.
దేశ ప్రజలంతా ఏకమై మోదీ దుశ్చర్యలను నిలదీయాల్సిన అవసరముందన్నారు.
బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా చివరకు ధర్మమే గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. జనమే లేని బీజేపీ సభలను అడ్డుకునే అవసరం మాకు లేదు. అనుమతులు లేకుండా సభలు ఎలా జరుగుతాయో బీజేపీకి తెలియదా? అని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు ఆదరించాన్నారు.