హైదరాబాద్ : నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని మంత్రి జగదీశ్‌రెడ్డి గురువారం పరామర్శించారు. కిడ్నీలో రాళ్ల సమస్యతో భూపాల్‌రెడ్డి బాధపడుతున్నారు. ఆల్ ఇండియా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ న్యూరాలజీ ఆసుపత్రిలో చికిత్స చేరారు. ఇవాళ నొప్పి తీవ్రం కావడంతో ఆయనకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటుండగా.. మంత్రి జగదీశ్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య, మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.