సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 23: ఎన్ని ఆటంకాలు వచ్చినా దళిత బంధు పథకాన్ని అమలులో వెనక్కి తగ్గేదే లేదని, దళితుల ఆర్థిక అసమానతలకు చెక్ పెట్టాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సూర్యాపేటలో జరిగిన మాలల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కుల రహిత సమాజ నిర్మాణం కోసం కలలు కన్న అంబేద్కర్ అందరి వాడని, ఆయన్ను ఏ ఒక్కరికో పరిమితం చేయడం సరికాదని పేర్కొన్నారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి సమ్మేళనం నిర్వాహకులు, హాజరైన ప్రతినిధులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.