హైదరాబాద్ : యాదాద్రి పునర్నిర్మాణ గత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. యావత్ ప్రపంచంలోనే యాదాద్రి నిర్మాణం అరుదైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించిన దేవాలయ పునః ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న జగదీశ్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో జిల్లామంత్రిగా పాలు పంచుకోవడం మహద్భాగ్యంగా భావిస్తున్నానన్నారు. అలాంటి దేవాలయానికి అన్నీతానై శిల్పి అవతరమెత్తి యాదాద్రి పునర్నిర్మాణం రూపంలో అద్భుతాన్ని సీఎం కేసీఆర్ సృష్టించారని అన్నారు. దేవాలయ పునః ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న మహా సంప్రోక్షణలో పాల్గొనడడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.