Jagadish Reddy | హైదరాబాద్ : ఎన్ఆర్ఐ ఐశ్వర్య రెడ్డి మృతిపట్ల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐశ్వర్య రెడ్డి పార్థివదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు మంత్రి కేటీఆర్‌తో ఎప్పటికపుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు.
ఐశ్వర్య కుటుంబానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే, తెలంగాణ ప్రభుత్వం తరుపున అమెరికాలోని భారత కాన్సులెట్ అధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, తెలంగాణ ఎన్నారై శాఖ నాయకులు మాట్లాడారు. విదేశీ పర్యటనలో ఉంటూనే ఎప్పటికప్పుడు ఐశ్వర్య రెడ్డి పార్థివ దేహాన్ని ఇండియాకు తరలించే ఏర్పాట్లపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షిస్తున్నారు.