Minister Jagadish Reddy | వెలుగును చూడటం ఇష్టంలేని వారు ఎప్పటికీ చీకట్లోనే ఉండిపోతారు.. కాంగ్రెస్ నేతలపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ (Congress) పార్టీకి ప్రజలు ఇప్పటికే నిరసన తెలియజేశారని, అందుకే ప్రతిపక్షంలో ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) ఫైరయ్యారు. అయినా ఆ పార్టీ నాయకులు ఇంకా బుద్ధి తెచ్చుకోకపోగా అవాస్తవాలు మాట్లాడుతూ యాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సూర్యాపేట: కాంగ్రెస్ (Congress) పార్టీకి ప్రజలు ఇప్పటికే నిరసన తెలియజేశారని, అందుకే ప్రతిపక్షంలో ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) ఫైరయ్యారు. అయినా ఆ పార్టీ నాయకులు ఇంకా బుద్ధి తెచ్చుకోకపోగా అవాస్తవాలు మాట్లాడుతూ యాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఏది అవాస్తవమని నిరసన చేస్తారని ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. సూర్యాపేట (Suryapet) ‘దశాబ్ది దగా’ పేరుతో కాంగ్రెస్ చేపట్టబోయే నిరసనల అంశంపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందటం అవాస్తవమని నిరసనా తెలుపుతారా అని నిలదీశారు. తమ ప్రభుత్వం వేసిన రోడ్ల మీద నడుస్తున్న ప్రతిపక్షాలు.. తామిస్తున్న మంచినీళ్లు తాగడం అవాస్తవమా అని మండిపడ్డారు.
ఫ్లోరిన్ (Fluoride) నీటి నుంచి విముక్తి చేయడం అవాస్తవమా అని విమర్శించారు. ఏ అభివృద్ధి జరగలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్దాలతో ప్రజలను నమ్మిస్తామని మూర్ఖపు భావనలో ప్రతిపక్షాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. చీకట్లో నడిచేవారు వెలుగును సృష్టించలేరని, వెలుగును చూడటం ఇష్టంలేని వారు ఎప్పటికీ చీకట్లోనే ఉండిపోతారన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

