Minister Jagadish Reddy | పేదల మనసును గుర్తెరిగిన మహానేత సీఎం కేసీఆర్ అని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 431 మంది లబ్ధిదారులకు రూ.4.31కోట్ల చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటికి పెద్ద కొడుకుగా ఆడపిల్లలకు మేనమామగా అప్పుడే పుట్టిన బిడ్డలకు పసికూనలకు తాతగా, మహిళలకు ఆసరాగా విభిన్న పాత్రల్లో జీవిస్తూ పేదరికంలో ఆడపిల్లల పెండ్లిళ్లకు ఆర్థికంగా ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు పెట్టిన పథకాలేనన్నారు.
పథకం కింద సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోనే 9,968 మంది లబ్ధిదారులకు రూ.80కోట్లు అందించినట్లు వివరించారు. సీఎం కేసీఆర్ చలువతో జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు మొత్తం రూ.6,348కోట్ల వెల్లడించారు. అభివృద్ధిలో అంతం కాదని, ఆరంభం మాత్రమేనని చెప్పుకొచ్చారు. అభివృద్ధిలో సీఎం కేసీఆర్ మార్క్‌కు ఇది ఒక ఉదాహరణ మాత్రమేనన్నారు. అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్న విపక్షాలకు జరుగుతున్న అభివృద్ధి నిద్రపట్టనివ్వడం లేదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల నుంచి రోడ్ల విస్తరణ దాకా అడ్డుకోవడమే రాష్ట్రంలో విపక్షాలు నేర్చుకున్న పని అంటూ విమర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటైనందునే రేవంత్‌రెడ్డికి, బండి సంజయ్‌లకు పార్టీ అధ్యక్ష పదవులుగా నియమితులైన విషయాన్ని విస్మరించరాదన్నారు.