హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఈనెల 21న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలని పలు చర్చిల బిషప్‌లను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం సికింద్రాబాద్ లోని మిలీనియం చర్చి హౌస్ కు వెళ్లి కార్డినల్ పూల అంటోని, సీ.ఎస్. ఎస్.ఐ.టీలో మెదక్ చర్చి బిషప్ పద్మారావును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సహ పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారని వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రిక అందజేసేందుకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను క్రిస్టియన్ పెద్దలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ ఇమ్మానియేల్ , విక్టర్, ఇన్నారెడ్డి, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, శంకర్ లూక్, మైనారిటీ కార్పొరేషన్ ఎండీ క్రాంతి వెస్లీ, విద్యా స్రవంతి, రాయడన్ రోస్, భాస్కర్ అయ్యా,కుమార్, ఓరుగంటి ఆనంద్, ఆరేపల్లి రాజేందర్, అజిత్ భాను కిరణ్ తో పాటు పలు చర్చిల ఫాదర్లు తదితరులు పాల్గొన్నారు.