Minister Indrakaran Reddy | ప్రభుత్వ దవాఖానలకు కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సర్కారు దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇప్పటికే గ్రామీణం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ హాస్పిటళ్లను ప్రభుత్వం అభివృద్ధి చేసిందని తెలిపారు.
నిర్మల్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సర్కారు దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇప్పటికే గ్రామీణం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ హాస్పిటళ్లను ప్రభుత్వం అభివృద్ధి చేసిందని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్‌లోని (Nirmal) ఎంసీహెచ్‌లో నిర్వహించిన ఆరోగ్య దినోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్లు, ఆశా వర్కర్లు, వైద్య బృందాలు, ప్రొఫెసర్లకు తెలిపారు. అనంతరం దవాఖానలో బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశారు. రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా.. వైద్య రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు.
అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తేవడంతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలను కూడా ఉచితంగా అందజేస్తున్నామని వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ఏంసీహెచ్ను 80 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. జిల్లా ఆసుపత్రితోపాటు ఇతర దవాఖానాల్లో మొత్తం 450 పడకలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

