సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అందుకే ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల ని కోరుతూ సర్వేల్లో గురువారం ప్రచారం చేపట్టారు.
కూసుకుంట్ల గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతుగా నిలువాలని కోరా రు. గడప గడపకూ వెళ్తుంటే సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల గురించి ప్రజలకే చెప్తున్నారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.