Basara | సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఐకే రెడ్డి
మంత్రి ఐకే రెడ్డి | శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు.

ఆదిలాబాద్ : శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు.
కుటుంబ సమేతంగా మంగళవారం అమ్మవారిని దర్శించుకున్న మంత్రి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
నవరాత్రి ఉత్సవాలు మంగళవారం 6వ రోజు మూల నక్షత్రం కావడంతో ఆలయాన్ని అధికారులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారు 6వ రోజు కాత్యాయిని దేవి రూపంలో దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ ఈవో వినోద్ రెడ్డి శాలువతో సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలతో బాటు అమ్మవారి ఆశీస్సులను అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాసర క్షేత్రాన్ని అంచలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే రూ.8 కోట్లతో ఆలయ అతిథి గృహాల నిర్మించామన్నారు. ఇంకా 42 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే వాటిని టెండర్లు పిలిచి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

