అందరి సమష్టి కృషితో బీఆర్ఎస్ సభ విజయవంతం : మంత్రి ఐకేరెడ్డి
Minister Ik Reddy | అందరి సమష్టి కృషితో మహారాష్ట్ర నాదేండ్లోని గురుగోవింద్ సింగ్ మైదానంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభ విజయవంతమైందని దేవాయదాశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : అందరి సమష్టి కృషితో మహారాష్ట్ర నాదేండ్లోని గురుగోవింద్ సింగ్ మైదానంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభ విజయవంతమైందని దేవాయదాశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కష్టపడి సభను విజయవంతం చేశారని పేర్కొన్నారు. తొలిసారిగా తెలంగాణ వెలుపల జరిగిన బీఆర్ఎస్ సభ కోసం నాందేడ్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌ను చూసేందుకు రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు.
సీఎం కేసీఆర్‌పై అభిమానాన్ని చాటిన బీఆర్ఎస్ మహారాష్ట్ర ప్రజాప్రతినిధులు, ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభ మంచి విజయం సాధించడంతో పాటు, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందని తెలిపారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు అనూహ్య స్పందన వస్తుందనడానికి ఈ సభ నిదర్శనమన్నారు. సభను విజయవంతం చేయడానికి సహకరించిన నాందేడ్ పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు, అనధికారులు, ప్రజాప్రతి నిధులు, రైతులు, ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

