మెదక్ : మెదక్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణం, మౌలిక వసతులను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం 8వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఉప్పల్, ఎల్బీ స్టేడియంలకు ధీటుగా ఈ స్టేడియం ఉందన్నారు. రూ. 5.70 కోట్లతో ఈ స్టేడియం అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హరీశ్‌రావు భరోసానిచ్చారు.