సంగారెడ్డి : జిల్లాలోని నందికంది గ్రామంలో గల రామ లింగేశ్వర స్వామి ఆలయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..11 శతాబ్దం నాటి దేవాలయం నంది కొండలో ఉండటం గొప్ప విషయం. ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.
మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరిక మేరకు 25 లక్షల రూపాయలు తక్షణం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల్లో జీవో కాపీ అందిస్తామన్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో కూడా సమావేశమై ఇంకా ఎలా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.