Eesha Rebba | ఆన్లైన్ దాడులపై హీరోయిన్ ఈషా రెబ్బ ఫిర్యాదు .. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
Eesha Rebba | సోషల్ మీడియా క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలపై ఆన్లైన్ వేధింపులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నటీమణులు లక్ష్యంగా అసభ్యకర కామెంట్లు, ట్రోలింగ్లు మితిమీరుతున్న నేపథ్యంలో తాజాగా తెలుగు నటి ఈషా రెబ్బ పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది.
Eesha Rebba | సోషల్ మీడియా క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలపై ఆన్లైన్ వేధింపులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నటీమణులు లక్ష్యంగా అసభ్యకర కామెంట్లు, ట్రోలింగ్లు మితిమీరుతున్న నేపథ్యంలో తాజాగా తెలుగు నటి ఈషా రెబ్బ పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. తనపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సమాచారం ప్రకారం, ఈషా రెబ్బ ఇటీవల తన తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతి ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీగా ఉన్న సమయంలో ఓ సోషల్ మీడియా మీమ్ పేజీలో ఒక వ్యక్తి ఆమెను లక్ష్యంగా చేసుకుని తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్య పోస్ట్ చేశాడు. ఆ వ్యాఖ్యలు లైంగిక వేధింపులకు దారితీసేలా ఉండటంతో పాటు పరువు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఆ వ్యక్తి ఉపయోగించిన భాష తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని, ఒక మహిళగా తన గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని ఈషా పోలీసులకు తెలిపింది. బహిరంగ వేదికలో అవమానించే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ విషయంపై ఈషా రెబ్బ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా, ఈషా రెబ్బ నటించిన ఓం శాంతి శాంతి శాంతి సినిమా ఇటీవల విడుదల కాగా, మూవీకి మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. మలయాళంలో విజయం సాధించిన జయ జయ జయ జయ హే చిత్రానికి ఇది అధికారిక రీమేక్. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఈషా సరసన తరుణ్ భాస్కర్ హీరోగా నటించారు.
సినిమా ప్రమోషన్ల సమయంలోనే ఈ వివాదం చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ పెళ్లి వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలను ఇద్దరూ అధికారికంగా ధృవీకరించలేదు. సరైన సమయం వచ్చినప్పుడు చెబుతానని తరుణ్ భాస్కర్ చెప్పగా, అలాంటిదేమీ లేదని ఈషా స్పష్టం చేయడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

