హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy)పై గడ్డం రాజు (38) అనే దుండగుడు కత్తితో దాడి చేయడంతో ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ప్రభాకర్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానలో చేర్పించారు.
విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు హుటాహుటిన దవాఖానకు వెళ్లి ప్రభాకర్ రెడ్డిని పరామ ర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. హత్యాయత్నంలో రాజకీయ కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరిపిస్తామన్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ కేడర్ ఎలాంటి ఆందోళనకు గురికావొద్దు. ప్రభాకర్‌రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి తెలిపారు.
Click Here For : దుబ్బాక బీఆరెస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి వీడియో
సికింద్రాబాద్ యశోదకు కొత్త ప్రభాకర్ రెడ్డి తరలింపు.. పరామర్శించిన మంత్రి హరీశ్‌రావు