Kotha Prabhaker Reddy | హైదరాబాద్ : దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రభాకర్ రెడ్డిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యశోద ఆస్పత్రికి చేరుకున్న మంత్రి హరీశ్‌రావు ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు మంత్రి ఆదేశించారు.