Harish Rao | తెలంగాణ నూతన సచివాలయంపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్‌కు సంబంధించిన ఒక సూక్తిని హరీశ్‌రావు ట్వీట్ చేశారు. మేము భవనాలను ఆకృతి చేస్తాము.. ఆ తర్వాత ఆ భవనాలు మనల్ని ఒక ఆకృతిలోకి తీసుకువస్తాయని ఆ కోట్ అర్థం. అంటే రాష్ట్ర ప్రగతికి ప్రతిబింబంగా ఉండే ఈ సచివాలయం.. భవిష్యత్‌లో మనకు మంచి మార్గనిర్దేశనం అవుతుందని దాని అర్థం.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఏప్రిల్ 30న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తున్నట్లు హరీశ్‌రావు తన ట్వీట్లో పేర్కొన్నారు. నూతన సచివాలయం పనులు చివరి దశకు చేరుకున్నాయి.
“We shape our buildings; thereafter, our buildings shape us.” – Winston Churchill
Dr BR Ambedkar Telangana State Secretariat is set for inauguration on April 30 by Hon’ble Chief Minister Sri K. Chandrasekhar Rao Garu.#TelanganaSecretariat pic.twitter.com/4o6hPrOb6g
— Harish Rao Thanneeru (@BRSHarish) April 21, 2023