Harish Rao | చంద్రయాన్-3 విజయవంతంపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. చంద్రునిపై విజయవంతంగా చంద్రయాన్-3 దిగినందుకు భారతీయులకు గర్వకారణం అని హరీశ్‌రావు తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ అద్భుతమైన విజయం వెనుక ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలకు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 విజయవంతమైంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఈ నేపథ్యంలో ఇస్రో ప్రధాన కార్యాలయంలోని శాస్త్రవేత్తలు ఆనందంతో పొంగిపోయారు. ఎంతో ఉత్కంఠతతో ప్రత్యక్ష్య ప్రసారాన్ని చూసిన కోట్లాది మంది భారతీయులు పట్టరాని సంతోషానికి లోనయ్యారు. చంద్రయాన్ -3 విజయం కోసం ఎందరో భారతీయులు ప్రత్యేక పూజలు, హోమాలు కూడా చేశారు.
A proud moment for Indians as #Chandrayaan3 landed on Moon successfully.
We are grateful to our #ISRO scientists who are behind this outstanding achievement. 🇮🇳 https://t.co/K7KlSF8VSK
— Harish Rao Thanneeru (@BRSHarish) August 23, 2023