Harish Rao | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కరెంట్ షాకివ్వాలి.. రేవంత్ అడ్డగోలు మాటలపై మంత్రి హరీశ్‌రావు ఫైర్
Harish Rao | హైదరాబాద్ : ఉచిత కరెంట్‌పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అడ్డగోలు మాటలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా రేవంత్‌పై హరీశ్‌రావు మండిపడ్డారు.
Harish Rao | హైదరాబాద్ : ఉచిత కరెంట్‌పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అడ్డగోలు మాటలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా రేవంత్‌పై హరీశ్‌రావు మండిపడ్డారు. రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేసీఆర్ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాతున్నారని నిప్పులు చెరిగారు.
నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టిన మనిషే, నేడు పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నడాని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పార్టీ మారినా మనిషి మారలేదు.. మనసు కరగ లేదు. పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి రైతులు తగిన శాస్తి చేయాలి. రైతన్నకు కరెంట్ వద్దన్న కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో కరెంట్ షాక్ ఇవ్వాలి అని హరీశ్‌రావు రైతులకు సూచించారు.
రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ
ధరణి వద్దు..
రైతు బంధు వద్దు..
ఉచిత కరెంటు వద్దు..!రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేసీఆర్ గారి పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాతున్నారు.… https://t.co/HsoipceQLG
— Harish Rao Thanneeru (@BRSHarish) July 11, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

