Minister Harish Rao | మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య మంగళవారం రైలును ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. త్వరలోనే తిరుపతి – బెంగళూరు నగరాలకు ట్రైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. సిద్దిపేటలో వీఎన్ఎస్ కన్వెన్షన్‌ను హరీశ్‌రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావును మరోసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా లక్షన్నర ఓట్లకుపైగా మెజారిటీతో గెలిపించాలని ఆర్యవైశ్యులు తీర్మానించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ కేదార్నాథ్, బద్రీనాథ్‌లో అన్నం పెట్టిన సిద్దిపేట సిద్దిపేట వైశ్యులదేనన్నారు. ఈ నెల 5న వెయ్యి పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామని, త్వరలోనే సిద్దిపేటలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు.