ఏడుపాయల దుర్గామాతకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు
మెదక్ : ఏడుపాయల దుర్గామాతకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్ రావు పట్టువస్త్రాలు సమర్పించి మహాశివరాత్రి జాతర ఉత్సవాలను ప్రారంభించారు. అంతకు ముందు ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు. మల్లన్నసాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 1500 కోట్లు కేటాయించారు. అందులో భాగంగా ఏడుపాయలకు 100 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు.
100 కోట్లతో ఫౌంటెన్స్, ఇతర అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సింగూర్‌కు లింక్ చేయడం వల్ల ఏడుపాయల్లో నీళ్లు ఎప్పుడు ఉంటాయి. సీఎం కేసీఆర్ కృషితో సింగూర్‌కు నీళ్లు వస్తున్నాయని ఆయన అన్నారు. గతంలో నీళ్ల కొరత ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించిన్నప్పుడు పనులు కానేకావు అని హేళన చేశారు.

నాడు హేళన చేసిన వారే నేడు పొగుడుతున్నారని మంత్రి గుర్తు చేశారు. మల్లన్నసాగర్ అంటే జల ప్రవాహిని. మల్లన్నసాగర్ నీళ్లతో మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. మంత్రి వెంట మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత తదితరులు ఉన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

