హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తోందంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతుందని ప్రశంసలు కురిపించారు. రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందనడానికి కేంద్ర గణాంకాలే నిదర్శనమని హరీశ్‌రావు పేర్కొన్నారు. తలసరి ఆదాయం వృద్ధిరేటులో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. జీఎస్డీపీలోనూ గణనీయమైన వృద్ధిరేటు సాధించిందని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం 19.10 శాతంగా నమోదు కాగా, జీఎస్డీపీలోనూ 19.46 శాతం వృద్ధిరేటును నమోదు చేసిందని హరీశ్‌రావు తన ట్వీట్లో పేర్కొన్నారు.
సీఎం శ్రీ కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పరుగులు తీస్తోంది.2021-22లో తలసరి ఆదాయంలో 19.10% వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.జీఎస్డీపీలోనూ 19.46% వృద్ధిరేటును నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ఈ వివరాలు ప్రకటించింది.
2/2— Harish Rao Thanneeru (@trsharish) March 1, 2022