బెజ్జంకి : సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చేరుకున్న మంత్రి ముందుగా గ్రామ చెన్న కేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని, మహిళా మండలి భవనం, ముదిరాజ్ భవనం, సెంట్రల్ లైటింగ్, డబుల్ బెడ్ రూం ఇండ్లు, మినీ వ్యవసాయ మార్కెట్, జిల్లా పరిషత్ హైస్కూలులో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. మంత్రి వెంట మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ తదితరులు ఉన్నారు.