కమలాపూర్/ కమలాపూర్ రూరల్, అక్టోబర్ 3: పేదలకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ వైపు ఉందా మా.. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజల ఉసురు తీస్తున్న బీజేపీ వైపు ఉందామా? ప్రజలు ఆలోచించుకోవాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్సే టీఆర్ఎస్ ప్రభుత్వమని స్పష్టంచేశారు. టీఆర్ఎస్కు అడ్డా అయిన కమలాపూర్ గడ్డపై గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మె జారిటీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. ఈటల రాకముందే కమలాపూర్‌లో టీఆర్ఎస్ బలంగా ఉన్నదని, ఆయన పార్టీ నుంచి వెళ్లి న తర్వాత కూడా పార్టీ బలంగా ఉన్నదనడానికి ధూం ధాంకు వచ్చిన ప్రజలే నిదర్శనమని చెప్పారు.
ఆదివా రం హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో జరిగిన ధూం ధాంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టీఆర్ఎస్ ఎమ్మె ల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు అండగా నిలుస్తున్న ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, కేసీఆర్ కిట్ తదితర పథకాలను వద్దన్న ఈటలకు ఓటు ఎందుకు వేయాలన్నారు. అనామకుడిగా ఉన్న మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రి పదవులు ఇచ్చి పెద్ద చేసిన సీఎం కేసీఆర్‌కు ఘోరీ కడతాననడం తగునా? అని రాజేందర్‌ను ప్రశ్నించారు.
కుర్చీ కోసమే ఈటల ఆలోచన
ఈటల రాజేందర్ ఏనా డూ ప్రజల కష్టాలను పట్టించుకోలేదని, ఆయన ఆలోచనలన్నీ కుర్చీ కోసమేనని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఆత్మగౌరవం పేరుతో కల్లబొల్లి మాటలు చెప్తున్న ఈట ల.. తాను గెలిస్తే ఏం చేస్తారో చెప్పడం లేదని విమర్శించారు. రూపాయి బొట్టుబిల్లలు, 80 రూపాయల గడియారాలతో బతుకుతమా.. ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మితో బతుకుతమో ప్రజలు గుర్తించాలని కోరారు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్, రైతుబంధు పథకాలు వద్దన్న ఈటల.. తాను మాత్రం రూ.10.50 లక్షల రైతుబంధు తీసుకున్నారని ఎద్దేవాచేశారు.
సామాన్యుల నడ్డి విరుస్తున్న బీజేపీ
వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ రేట్లను పెంచి బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తున్నదని హరీశ్‌రా వు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుంటే, బీజే పీ ప్రభుత్వం కరెంటు మోటర్లకు మీటర్లు పెట్టమని ఒత్తిడి చేస్తున్నదని విమర్శించారు.రాష్ట్రంలో పం డుతున్న దొడ్డు వడ్లను కొనబోమంటున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్‌కే సున్నం పెట్టిన ఈటల: బాల్క సుమన్
రాజకీయ భవిష్యత్తునిచ్చి అన్నం పెట్టిన కేసీఆర్‌కే ఈటల సున్నం పెట్టారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. కాంగ్రెస్‌కు చెందిన ఆడెపు విజయతోపాటు పలువురు హరీశ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, మండల ఇంచార్జి పేరియాల రవీందర్రావు, సర్పంచ్ కట్కూరి విజయ, నాయకులు పాడి కౌశిక్‌రెడ్డి, స్వర్గం రవి, బాలసాని కుమారస్వామి, మెండు రమేశ్ పాల్గొన్నారు.
చెమట వాసన నుంచి పెరిగిన బిడ్డను..
చెమట వాసన నుంచి పెరిగిన బిడ్డను.. పేదల కష్టా లు పేదలకే తెలుస్తయని సీఎం కేసీఆర్ నాకు టికెట్ ఇచ్చి మీ ఆశీర్వాదం కోసం పంపించారు. ఈటలను ఆరుసార్లు గెలిపిస్తే నియోజకవర్గానికి చేసిందే మీ లేదు. నన్ను ఒక్కసారి గెలిపిస్తే హుజూరాబాద్‌కు మెడికల్ కాలేజీ తీసుకొచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తా. పేద ప్రజలను ఈటల ఏనాడూ పట్టించుకోలేదు. కనీసం సొంతూరిలోనూ ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించలేదు. ముదిరాజ్ కులానికి చెందిన ఓ మహిళ డబుల్ బెడ్రూం ఇల్లు కట్టియ్యాలని ఈటలను అడిగితే.. ఇల్లు లేకుండానే బతుకుతున్నరా? అంటూ వెకిలిగా మాట్లాడిండు.
బీజేపీ బూమరాంగ్ విమర్శలు
హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు ఇస్తున్న హామీలు, చేస్తున్న విమర్శలు ఆ పార్టీకే బూమరాంగ్ అవుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా హుస్నాబాద్ సభకు హాజరైన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తమ పార్టీ అభ్యర్థినే ఇరకాటంలో పెట్టారు. నిరుద్యోగ భృతి ఏమైందని రాష్ట్రప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని పార్లమెంటులో మోదీ ఇచ్చిన హామీని ఆమె విమర్శలు తిరగదోడినట్టు అయింది.